Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
మండలంలోని పెరుమాండ్లగూడెంలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామంలోని సేంద్రియ రైతులు 30 మందితో 60 లీటర్ల ఆవు పాలు, 60 కేజీల ఆవు పెరుగు, 100 లీటర్ల ఆవు మూత్రం, 100 కేజీ ఆవు పేడ, 60 లీటర్ల కొబ్బరి నీళ్లు, 15 కేజీల ఆవు నెయ్యి, 30 డజన్ల అరటిపండ్లుతో బుధవారం పంచగవ్య చేయించారు. ఈ సందర్భంగా వీదేశీ ప్రతినిధులు అవగాహన కల్పించారు. వరి పంటలో పంచగవ్యను ఉపయోగించటం ద్వారా అధిక దిగుబడి పాటు సేంద్రియ పద్ధతి ద్వారా ఉన్న ఉపయోగాలు తెలిపారు. సేంద్రియ రైతులకు ఉన్న అపోహలను తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిడుగు రజిత, నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, ప్రోగ్రాం ఆఫీసర్ సింగిరెడ్డి సునీత, సీనియర్ కోఆర్డినేటర్ మూల మహేష్, కోఆర్డినేటర్ శంషుద్దీన్, ఆర్గానిక్ గ్రూప్ లీడర్స్ కూస చిరంజీవిరెడ్డి, స్వరూప, సభ్యులు పిడుగు లింగయ్య, పిడుగు రాజు, భాషిక కొమురయ్య, వరంగంటి లింగమూర్తి, పిడుగు రవి పాల్గొన్నారు.