Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో జాతీయ రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్- ఖమ్మం, కురవి -ఖమ్మం, వలిగొండ- భద్రాచలం జాతీయ రహదారుల పనులకు సంబంధించిన పురోగ తిపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించి ఇప్పటికే జరిగిన భూసేకరణ 3డి నోటిఫికేషన్ చేయాలని అదేవిధంగా వలిగొండ -భద్రాచలం జాతీయ రహదారులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారుల జేఈ మదన్ మోహన్, డీఈ సూరిబాబు, ఆర్డీవో కొమురయ్య సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.