Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని తమ్మడపల్లి(ఐ) గ్రామాపంచా యతీ వద్ద గురువారం సర్పంచ్ గాదెపాక అనిత- సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లా డుతూ... తెలంగాణ సంస్కతీ, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహి స్తున్నదన్నారు. బతుకమ్మ కానుకగా చీరలు అంది స్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవికుమార్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రడపాక రైమాన్, గ్రామశాఖ అధ్యక్షులు వార్డు సభ్యులు భూపాల్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాంబరాజు, వార్డు సభ్యులు సాంబ శివచారి, రడపాక రాజ్‌కుమార్, రేణుక దేవి, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
పడమర కోటలో...
ఖిలా వరంగల్ : 37వ డివిజన్ ఖిలా వరంగ ల్ పడమర కోటలో ఆర్పీలు కోమల, రాధిక ఆధ్వ ర్యంలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ కార్య క్రమం ప్రారంభించారు. కార్పొరేటర్ బోగి సువర్ణ-సురేష్ హాజరై కమ్యూనిటీ హాల్(అంబేద్కర్ భవన్)లో స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లా డుతూ.. ఆడబిడ్డలకు ముందస్తుగా సద్దుల బతు కమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మెప్మా సిఓ ప్రవీణ్, స్థానిక నాయకులు మేకల ఎల్లయ్య, నలిగంటి అభిషేక్, నలిగంటి నవీన్, కాంపెల్లి హరినాథ్, చందు, నిఖిల్, గద్దల పవన్, నర్సింగం, పుప్పాల అనిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జరుపుకోవాలి : సర్పంచులు
గార్ల : తెలంగాణ సాంప్రదాయ పండగైన బతుకమ్మ పండుగ వేడుకలను ప్రతి ఇంటిలో అనం దోత్సవాలతో అంగరంగ వైభవంగా జరుపుకో వాలని సర్పంచ్‌లు నూనావత్ జ్యోతి, గంగావత్ రుక్మిణీ, బానోత్ ఉష అన్నారు. మండలంలోని పిని రెడ్డిగూడెం, చిన్న కిష్టాపురం, చిన్న బంజార పంచాయతీ కేంద్రాలలో గురువారం బతుకమ్మ చీరలు పంపిణీ చేసి వారు మాట్లాడారు. తెలంగాణ సంస్కతీ,సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని తెలపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసి లు ధనియాకుల రాజకుమారి, బి.మంజుల, పంచాయతీ కార్యదర్శి లు జి.లలిత, సరితా,మంగిలాల్,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.