Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
జిల్లాల టాస్క్ ఫోర్స్ కమిటీ ల ఆదేశాల మేరకు హనుమకొండ, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంల ద్వారా అనధికార నిర్మాణాలను గురువారం తొలగించారు. జీడబ్ల్యూఎంసీ పరిధి వరంగల్-43 డివిజన్ గణేష్‌నగర్‌లో నాలుగు అనధికారికంగా నిర్మించిన భవనాలు, మంజూరైన ప్లాన్ ప్రకారం కాకుండా నిర్మించిన డివియేషన్లను తొలగించారు. అదేవిధంగా హన్మకొండ 4వ డివిజన్ రెడ్డి కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన ఓ అదనపు అంతస్తును తొలగించారు. నగర ప్రజలు టీఎస్‌బీ పాస్ ద్వారా మంజూరు చేసిన ప్లాన్ ప్రకారమే ఎలాంటి డివియేషన్ లేకుండా ఖచ్చితంగా నిర్మించుకోవాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుని కూలగొడతామని బల్దియా సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు. రెవెన్యూ, పోలిస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, బల్దియా అధికారులు పాల్గొన్నారు.