Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలం వెంటగిరి, ఇంటికన్నె, బెరువాడ గ్రామాలకు చెందిన ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను, బతుకమ్మ చీరలను గురు వారం లబ్ధిదారులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అందరికి పెన్షన్లు ఇస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు దేశం నలుమూలాల నుండి వచ్చి తెలంగాణలో మాయ మాటలు చెపుతున్నారని, వారిని నమ్మే రోజులు లేవని అన్నారు. హైదరాబా ద్‌కు రోజుకో కేంద్ర మంత్రి వచ్చి పర్యటన చేసి నంత మాత్రన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, మహబుబబాద్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాదారపు సత్యనారాయణరావు, ఇంటీకన్నె సర్పంచ్ ఘనపారపు సరితారమేష్, బెరువాడ సర్పంచ్ ముదిగిరి సాంసయ్య, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, నజీర్ అహ్మద్, కముటం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రావుల నవిన్రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.