Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
సమాచార హక్కు చట్టం-2005 సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసముద్రం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ అన్నారు. గురువారం మహాబూబాబాద్ జిల్లా కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ చాం బర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక ధన్య వాదా లు తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ దష్టికి సమాచార హక్కు చట్టం కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమాచార హక్కు చట్టంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ స్వచ్చందంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చినట్టు తెలిపారు.