Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని గురువారం వరంగల్ ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్(ఎండీ డిఎం కార్డియాలజీ) ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ నుండి ఎంజీఎం జంక్షన్ వరకు హదయ సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలు ప్రతి రోజు 35 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని, నడక ద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. పోస్ట్ కోవిడ్ పేషెంట్లు ప్రతి ఒక్కరు ముందస్తుగా గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనం స్వచ్ఛంద సంస్థ సభ్యులు జి.ఎస్.టి.జి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, నగరానికి చెందిన పలువురు డాక్టర్లు అల్లడ సజన్, డాక్టర్ అన్వేష్, డాక్టర్ అజరుకుమార్, డాక్టర్ పూర్ణచందర్, డాక్టర్ సజన్ , డారవీందర్ మరియు శ్రావణ్ కార్డియాలజీ సెంటర్ బృందం వారు పాల్గొన్నారు.