Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరమ్మతులు చేయని అధికారులు
నవతెలంగాణ - చిన్నగూడూరు
సాగు, తాగు నీటి కోసం ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. చెరువు నీటి నిల్వ కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తోంది. కానీ, ఇందుకు విభిన్నంగా భూషకుంట చెరువు ఉంది. చెరువు మరమ్మతులకు నోచుకోకపోవడంతో నీరు వధాగా పోతున్న పరిస్థితి నెలకొంది. సర్వే నెంబర్ 142లో 10.16 గుంటలు విస్తరించి ఉంది. కాల క్రమేనా చెరువు భూ ఆక్రమణకు గురవుతోందనే ఆరోపణలొస్తున్నాయి. మత్తడి సగం వరకే నిర్మించడంతో నీళ్లు వధాగా పోతున్నాయని రైతులు పలుమార్లు నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవించారు. అధికారులు బోషకుంట చెరువును పరిశీలించి మరమ్మతులు, మత్తడి నిర్మిస్తామని హామీనిచ్చి విస్మరించారు. దీంతో ఎలాంటి మరమ్మతులు జరగడం లేదని, చెరువు ఆయకట్టు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సందర్శించి సత్వరమే మత్తడి నిర్మించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.