Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మత్స్యకారుల అభివద్ధే కేసీఆర్ లక్ష్యమని ఎర్రబెల్లి గూడెం సర్పంచ్ బొమ్మెర అశోక గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్‌గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఎర్రబెల్లిగూడెం గ్రామానికి 66 వేల చేప పిల్లలు ప్రభుత్వం అందించిందని తెలిపారు. గత పాలకులు గ్రామాల అభివద్ధి కోసం పాటుపడిన దాఖలు లేవని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సొసైటీ అధ్యక్షులు బండారు మల్లయ్య, మత్స్యశాఖ ఫీల్డ్ ఇన్చార్జి వద్ది శ్రీపతి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు భూముల శ్రీనివాస్, సొసైటీ బాద్యులు యాటకానిఅశోక్, బండారి ఉప్పలయ్య, భూముల ఉప్పలయ్య, ఎల్లయ్య, జెన్నే యాకయ్య తదితరులు పాల్గొన్నారు.