Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్
నవతెలంగాణ-కొత్తగూడ
5వ షెడ్యూల్డ్ ప్రాతంలో పెసా చట్టం ప్రకారం ఏజెన్సీలో చేపలు పట్టుకొనే హక్కు గిరిజనులకే ఉందని తీర్మానించిన్నట్లు ఐటీడీఏ పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని దుర్గాడ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో పెసా గ్రామ సభ సర్పంచ్ సనప నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాతూ 1950 గ్రామ నక్ష ఆధారంగా 80 సంవత్సరాలుగా నుండి సాగుచేసుకొంటున్న రెవెన్యూ భూములకు పట్టాలివ్వాలని సభలో తీర్మానించినట్టు తెలిపారు. గుండ్రపల్లి రెవిన్యూ శివారులోని దానవాయి చెరువు లోని 107 ఎకరాల భూముల్లో 56 ఆదివాసీ గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయ న్నారు. అవి అటవీశాఖ పరిధిలోని వన్యప్రాణుల సంరక్షణకు వెళ్లిందని అధికారులు చెప్పడం సరైంది కాదన్నారు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులందరికి హక్కు పత్రాలు కల్పించాలన్నారు. దుర్గారం గ్రామంలో మద్యపానం రద్దు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో దొర పటేళ్లు ఫుల్సం రామస్వామి, వజ్జ రామయ్య, పంచాయతీ కార్యదర్శి మల్లెల కల్యాణి ,పెసా కమిటీ ఉపాధ్యక్ష కార్యదర్శులు సనప క్రిష్ణ బాబు, వజ్జ జయేందర్, ఉపాధ్యాయులు డాక్టర్ ఫుల్సం సాంబయ్య ,ఫుల్సం ప్రమీల ,గట్టి సమ్మయ్య ,పెసా మోబిలైజర్ కల్తీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.