Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కళాకారుల సమాఖ్య
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ మలి విడత ఉద్యమంలో గజ్జెకట్టి ఆడి పాడి ఊరురా జనాలను చైతన్యం చేసిన ఉద్యమ కళాకారులకు కళాబంధు పథకం ఎర్పాటు చేసి రూ.10లక్షలు అందజేయాలని తెలంగాణ కళాకారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. తెలంగాణ కళాకారుల సమాఖ్య జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా అధ్యక్షులు రాగల్ల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రతాప్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకంగా ఉందని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతమంది కళాకారులకు తెలంగాణ సాంస్కతిక సారధి ద్వారా ఉద్యోగాలు వచ్చాయన్నారు. మరికొంతమంది నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకు వెళ్లే విధంగా కళాకారులు పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగం రాని వారిని నిరుద్యోగులుగా గుర్తించి కళాబంధు పథకం ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల కళాకారులు సతీష్, పుల్లల వంశీ, రావి రాజు, చిలుమోజు సాయికిరణ్, గజ్వేల్ రాజశేఖర్, ప్యాడ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.