Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
ప్రతి అభివద్ధి కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూసి ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవద్దని, దురుద్ధేశంలో పనులను అడ్డుకుంటే రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కాట్రపల్లి,వెంకటాపురం గవిచర్ల, రామచంద్రపురం, లోహిత, షాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ పాల నలో గ్రామాల అభివద్ధికి అనేక పథకాలు కెేసీఆర్ అమలు చేస్తున్నరన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు కొందరు ఉనికి కోసం అడ్డు తగిలితే సహిం చేది లేదన్నారు. కాట్రాపల్లిలో గతంలో రూ.10 లక్షలతో అభివద్ధి చేసిన ప్రకతి వనం నేడు కోట్లరూ పాయల విలువకు పెరిగిందని అన్నారు. నాడు దానిని అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవ డానికి ప్రయత్నం చేసినా కార్యదీక్షతో చేసిన సర్పంచ్ సాగర్ రెడ్డిని అభినందించారు.అనంతరం కాట్రపల్లి గ్రామంలో రూ.54.52 లక్షలతో పలు అభివద్ధి పనులను ప్రారంభించారు. రూ.12.60లక్షలతో వైకుంఠదామం, రూ.35.00 లక్షలతో సీసీ రోడ్లను, రూ.7.00 లక్షలతో మహిళ ప్రగతి భవనం, పల్లె ప్రకతి వనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ కందగట్ల కళావతి, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ కందగట్ల నరహరి, సర్పంచులు పూజారి ఉమా గోవర్ధన్, దొనికేల రమా శ్రీనివాస్, బొంపల్లి జయశ్రీ దిలీప్ రావు,సట్ల రాజు, నాగినేని జ్యోతి జగన్మోహన్రావు, ఎంపీడీవో మల్లేశం, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.