Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లాకు మంజూరు చేయనున్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశా లను జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మ భిక్షం డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నెహ్రూ పార్క్ వద్ద ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురు కుల పాఠశాలను జనగామ కు కేటాయిస్తే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ జిల్లా లోని రాయి కల్ గ్రామంలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం సరైంది కాదన్నారు. ఈ ప్రతిపాదనను మంత్రి వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జనగామ జిల్లాకు అన్యాయం జరుగుతుం దని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానం పై మంత్రి కి చిత్త శుద్ది లేదని, అభివద్ధి కి అమడ దూరంలో ఉంటున్నారని మండి పడ్డారు. స్వంత జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగితే ప్రజాప్రతనిధు లంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించా రు. వెంటనే అధికారులు చొరవ చూపి జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, అక్షిత్, తదితరులు పాల్గొన్నారు.