Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి తెలిపారు. మండలంలోని రాఘవపూర్, గర్మిళ్లపల్లి, వెలిశాల, పంగిడిపల్లి, రాఘవరెడ్డిపేట, ఆరెపల్లి, దుబ్యాల, మందలోరిపల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన గురువారం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ, జెడ్పీటీసీ ముఖ్యఅతిథులుగా హాజరై మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రపంచంలోనే బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పేదింటి మహిళలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతోనే సీఎం కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ సురేష్, రాఘవపూర్ సర్పంచ్ నందికొండ శోభారాణి మహిపాల్‌రెడ్డి, గర్మిళ్లపల్లి సర్పంచ్ నల్లబెల్లి రమా రవీందర్, వెలిశాల సర్పంచ్ చింతలపల్లి విజయ స్వామిరావు, రాఘవరెడ్డిపేట సర్పంచ్ చదువు మధుర మహేందర్‌రెడ్డి, ఆరెపల్లి సర్పంచ్ గజ్జి సుజాత రమేష్, దుబ్యాల సర్పంచ్ బిల్లకంటి ఉమేందర్రావు, మందలోరిపల్లి సర్పంచ్ కట్కూరి నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు ఏనుగు తిరుమల లచ్చిరెడ్డి, గంధం వజ్ర సారయ్య, బిక్కినేని అనిత సంపత్‌రావు, ఆయా గ్రామాల ఉపసర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.