Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-హన్మకొండ
జిల్లాలోని టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం నియోజక వర్గానికి చెందిన దినసరి కూలీ కట్కూరి వేణు అకాల మరణం పొందగా ఆయనకు కార్మిక శాఖలో భీమ చేయించినందున కార్మిక శాఖ నుండి రూ.1.30 లక్షల పరిహారాన్ని ఆయన భార్యకు వినయ్‌భాస్కర్ అందజేశారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ భవిష్యత్ లో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు అసంఘటిత కార్మికులకు లేబర్ కార్డులను అందజేశారు...అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు సంఘటితమై కార్మిక శాఖలో నమోదు చేసుకోవాలని తను గత కొన్నేండ్లుగా అవగాహన కల్పించడమే కాకుండా తన వ్యక్తిగతంగా 13 వేల మందికి లేబర్ కార్డులు ఇప్పించడమే కాకుండా 5 వేల మందికి పరిహారాన్ని అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు..కార్మికులందరూ లేబర్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లేబర్ కార్డులు పొందిన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.