Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసి వెంకటేష్
నవతెలంగాణ-వేలేరు
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తప్పవని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసి వెంకటేష్ స్పష్టం చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాట్రేవుల రాజు ఆధ్వర్యంలో మండలంలోని లోక్యాతండాలో చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయని చెప్పారు. ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. లోక్యాతండా పట్ల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సరైన ఇండ్లు, అంతర్గత రోడ్లు లేక తండావాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో మురుగునీటితో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని, అర్హులకు పింఛన్లు అందడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అధికారులు తండా వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆ పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో కన్వీనర్ గురిజాల వీరన్న, బూత్ కమిటీ అధ్యక్షులు మురావత్ రాజు, వీరన్న, సంపత్, మోహన్, సాంబయ్య, గణేష్, విజరు, రమణ, వినోద, భద్ర, భూక్యా లక్ష్మి, కూరపాటి శ్రీనివాస్, మండల రవి, రాజలింగం, ప్రవీణ్, కిరణ్, రాజేష్, అశోక్, మహేష్, యుగేంధర్, సందీప్, లక్ష్మణ్, భద్రు, గుగులోతు రాజు, తదితరులు పాల్గొన్నారు.