Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకుడు జేఎస్ఆర్
నవతెలంగాణ-భీమదేవరపల్లి
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తోందని బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకుడు, వక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని ముల్కనూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ పాఠశాలలో కులాల వారీగా విద్యార్థుల హాజరు పట్టిక ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను కులాల పేరిట విభజిస్తోందని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేవని చెప్పారు. భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని మైసంపల్లికి రోడ్డు వేయించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. జేఎస్సార్ పేరుతో మైసంపల్లికి సొంత నిధులతో రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ స్థానికంగా ఉండకపోవడం వల్ల పూర్తిస్థాయి సమస్యలు ఆయనకు తెలియడం లేదని విమర్శించారు. మరిన్ని గ్రామాలకు రోడ్లు వేస్తానని తెలిపారు. సమావేశంలో నాయకులు గుండెల్లి సదానందం, బొల్లంపల్లి శ్యామ్, అయిత సాయితేజ, మీస మహేష్, కాసగోని పవన్, నోముల భిక్షపతి, చొప్పరి నవీన్ పాల్గొన్నారు.