Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ, ఎల్డీసీ బయర్ క్రాప్ సైన్స్ ఆధ్వర్యం లో రైతులకు పత్తి పంటలో వచ్చు గులాబీ రంగు పురుగుపై యజమాన్యం గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సహాయ సంచాలకుడు డాక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా మూడ్రోజులు బుట్టలో ఎనిమిది తల్లి రెక్కల పురుగులు రైతులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గుడ్డి పూలను గమనిస్తే వాటిని తీసి నాశనం చేయాలని చెప్పారు. ఉదయం లేదా సాయంత్రం 7 లోపు మందుల పిచికారీ చేయాలన్నారు. గులాబీ రంగు పురుగు నివారణ కోసం క్లోరిపైరిఫాస్, క్వినాల్ఫాస్, ప్రొపిన్పాస్ లాంటి మందులను తగిన మోతా దులో పిచికారి చేయాలని వివరించారు. ఎల్డీసీ, సీనియర్ మేనేజర్ గంగాధర్ మాట్లాడుతూ కంపెనీ ఆధ్వర్యంలో ఒక్కో రైతుకు ఉచితంగా 10 చొప్పున లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బేయర్ క్రాప్ సైన్స్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ పత్తి పంటలోని పత్తిని డిసెంబర్ లోపు తీసుకొని పత్తిని పీకి కాల్చేయాలని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకుడు రవీందర్రెడ్డి, ఏఓ శ్వేత, ఏఈఓ పవన్, బేయర్ కంపెనీ మేనేజర్ లక్ష్మీనారాయణ, ఎల్డీసీ ప్రతినిధులు అభిషేక్, ఉపేంద్ర, అనిల్ కుమార్, శంకర్, కష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.