Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామాభివద్ధికి సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ప్రజలు సమిష్టిగా పాటుపడాలని డీఎల్పీఓ సుధీర్ కుమార్ సూచించారు. మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీలో వార్డు సభ్యుల తీర్మాణాలు లేకుండా సర్పంచ్ సుంకరి సత్యనారాయణ రోడ్లపై మట్టి పోస్తున్నాడని, ఓసీపీకి డేంజర్ జోన్లో కొత్తగా నిర్మించిన ఇండ్లకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని, వార్డు సభ్యులు గ్రామంలో పలు అభివద్ధి చేపడితే బిల్లులకు సహకరించడం లేదని ఇటీవల పలువురు వార్డు సభ్యులు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు కలెక్టర్ దివాకార ఆదేశాల మేరకు డీఎల్పీఓ గురువారం గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారు. గ్రామంలో పలు వార్డుల్లో నూతనంగా పోసిన మట్టి రోడ్లకు సమిష్టిగా తిర్మణాలు చేసి పంపాలని లేదంటే సర్పంచ్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన ఇండ్లకు అక్రమ వసూళ్లపై విచారణ చేస్తామన్నారు.
అక్రమ వసూళ్లు, మట్టి రోడ్లపై విచారణ చేయాలి : వార్డు సభ్యులు
గ్రామంలో గ్రామసభలు నిర్వహించకుండా, వార్డు సభ్యుల నుంచి తీర్మానాలు లేకుండా సర్పంచ్ రోడ్లపై మట్టి పోయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురౌతున్నట్టు వార్డు సభ్యులు తెలిపారు. డేంజర్ జోన్లో కొత్తగా నిర్మించిన ఇండ్లకు సంబంధించి సర్పంచ్, కార్యదర్శి కుమ్మక్కై ఒక్కో యజమాని నుంచి రూ.15-20 వేలు వసూలు చేసి రూ.283లకు రసీదు ఇచ్చారని తెలుపుతూ డీఎల్పీఓకు వినతిపత్రం అందజేశారు. అక్రమ వసూళ్లపై, మట్టి రోడ్లపై విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రయ్య, వార్డు సభ్యులు కుంట సది, కేశారపు భారతి, రాగం పుష్పలత, రాగం పుష్పలత, ఆకుల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు మల్క మధుసూదన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.