Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆనవాయితీగా వస్తున్న తీజ్ పండుగ వారసత్వాన్ని భావితరాలకు అందించేలా ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలోని బానోత్ వీధితోపాటు కమలాపూర్, గొల్ల బద్దారం, దూదేకులపల్లి గ్రామాల్లో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో తీజ్ వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలకు సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భావితరాలకు తీజ్ వారసత్వమని, ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అన్నారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నత్యాలు, పాటలతో అంగరంగ వైభవంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. అందరూ సంప్రదాయ వస్త్రాలను ధరించి భావితరాలకు వాటి విశిష్టత తెలియజేయాలని కోరారు. తొలుత చేసిన నత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అంబాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తోట సంతోష్, పైళ్ల చంద్రారెడ్డి, పిప్పాల రాజేందర్, తోట రంజిత్, నగునూరి రజినీకాంత్, చరణ్, పధ్వీ, తిరుపతి, అజ్మీరా స్వామి, అజ్మీరా శ్రీనివాస్, అజ్మీరా ఊదానాయక్, అజ్మీరా జయపాల్, చందు, రమేష్, కోటయ్య, సురేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.