Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన విధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను కాలయాపన చే యకుండా ఏర్పాటు చేయాల్సిందేనని కాంగ్రెస్ మహబూ బాబాద్ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రారెడ్డి, నియో జకవర్గ నాయకులు డాక్టర్ భూక్యా రాంచంద్రనాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఉమ్మడి విభజన చట్టంలో పొందు పరిచిన బయ్యారంలో ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగల్బాలు పలికారన్నారు. రాష్ట్రం నురచి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్రెడ్డి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలం గాణ రాష్టం ఏర్పడితే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తన స్వార్ధ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్లో చేరారన్నారు. నియోజకవర్గ అభివద్ధి పక్కనబెడితే ఎమ్మెల్యే మాత్రం ఆర్ధికంగా బలోపేతమయ్యారని ఆరోపించారు. బయ్యారం లో ఉక్కు పరిశ్రమ కేవలం అధికార పార్టీ రాబోయే ఎన్నికలలో లబ్ది కోసమే వాడుకుంటున్నారని, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉక్కు పరిశ్రమ కోసం నిరాహారదీక్ష చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని సూచించారు. ఉక్కు పరిశ్రమ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ భూక్యా లక్ష్మీ, మహిళ కాంగ్రెస్ నాయకురాలు నిర్మల రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్, సొసైటీ డైరెక్టర్ కేతామల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోకినేని సీతారామయ్య, దామోదర్ రెడ్డి, గౌరిశెట్టి వెంకన్న, రామ్ కోటి, సుధాకర్ రెడ్డి, నిరంజన్, యాదగిరి, నిరంజన్, మహేష్, బాను తదితరులు పాల్గొన్నారు.