Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్
నవతెలంగాణ-బచ్చన్నపేట
భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వల్ల లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పోచన్నపేట గ్రామంలోని రైతు వేదికలో రైతులకు డివిజన్ స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. జనగామ జిల్లా రైతుబంధు అధ్యక్షులు ఈర్రిి రమణారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. పచ్చిరొట్ట, వెదజల్లే పద్ధతిలో వరి సాగు, పీఎస్పీ వంటి కార్యక్రమాలతోపాటు పలు కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ అవగా హన కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ కల్లూరి సంజీవరెడ్డి, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎస్ బీనా, వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్ రెడ్డి, సర్పంచ్ గట్టు మంజుల, ఎంపీటీసీ మామిడి అరుణ, చిన్న రామచెర్ల. తమ్మడపల్లి, పోచన్నపేట గ్రామాల రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, సర్పంచులు ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.