Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2వేలమందితో యువగర్జన సక్సెస్
- ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
యువత అన్ని రంగాలతోపాటు రాజకీయంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఎదగాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో యూత్ యువగర్జన సభను శుక్రవారం యూత్ మండల అధ్యక్షుడు జంగ వంశీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలం గాణ రాష్ట్రం కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూత్ పోరాట ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో యువత అన్ని రంగాల్లో అభివద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ అనేక రకాల కార్యక్రమాలను చేపడుతు న్నారని అన్నారు. నియోజకవర్గంలో నెల్లికుదురు మండల కేంద్రంలో సుమారు 2000 మందితో యువగర్జన సభను ఏర్పాటు చేయటం సంతో షకరమన్నారు. దీనికి గ్రామాల నుండి అధిక సంఖ్యలో తరలొచ్చిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు తెలి పారు. యువత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. యువకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. యువత లక్ష్య సాధన కోసం పాటుపడాల న్నారు. నియోజకవర్గ కేంద్రంలో సుమారు పదివేల మందితో త్వరలోనే యువగర్జన సమావేశాన్ని నిర్వహించి కేటీఆర్‌తో పెద్ద సభ ఏర్పాటు చేయ నున్నట్టు తెలిపారు. దీనికి కేటీఆర్ వచ్చి యువతకు కావాల్సిన అన్ని రకాల విషయాలపై కులం కుశంగా చర్చిస్తామని అన్నారు. మహబాద్ నియోజకవర్గాన్ని బంగారు మహబూబాబాద్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
మండలంలోని రతిరామ్తండా గ్రామంలో శుక్రవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రారంభించారు. గత పాలకులు అభివృద్ధిని పట్టిం చుకున్న పాపాన పోలేదని అన్నారు. పేదింటి ఆడ పిల్ల పెళ్లి చేసుకుంటే గతంలో ఎవరు కూడా పట్టిం చుకోలేదని, నేడు రూ.లక్ష 116 ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. రైతు బీమా, రైతుబంధు, 24 గంటల విద్యుత్, తదితర ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గతంలో తండాల ఓట్లు దండుకున్నారే తప్ప అభివద్ధి చేయలేద న్నారు. కేసీఆర్ సీఎం తండాలను గ్రామపంచాయ తీలుగా చేసి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తున్నా రని అన్నారు.
ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ బీరవెల్లి యాదగిరి, రెడ్డి జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ వాణి శ్రీనివాస్, యూత్ జిల్లా అధ్యక్షుడు యాల మురళీధర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చిర్ర యాకాంతంగౌడ్, గుదే వీరన్న, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకట్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, పీఏసీఎస్ చైర్మన్లు లక్ష్మీ చంద్రశేఖర్‌రెడ్డి, దేవేందర్‌రావు, గుండా వెంకన్న , ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భీముడు, అలాగే సర్పంచ్ గుగులోతు బిక్కు నాయక్, తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మెన్ టాన్సింగ్, తదితరులు పాల్గొన్నారు.