Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ భాగమైందని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛను లబ్దిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచు లకు బతుకమ్మ కానుకగా సంప్రదాయంగా సారె అందిస్తుందని, ఆమేరకు జీపి లో 4191 మహిళలకు బతుకమ్మ చీరలను, 969 ఆసరా పింఛన్లు లబ్దిదారులకు గుర్తింపు కార్డులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలో మహి ళలను భాగస్వామ్యులను చేసిందని తెలిపారు. తెలంగాణ సంస్కతీ, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగని అన్నారు. బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారి కంగా ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ ఆడప డుచులందరికీ, కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు పుట్టింటి కానుకగా కోటికి పైగా చీరలను అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు.
పోషకాహారం ముఖ్యం
బాలింతలకు, గర్భిణీలకు పోషకాలతో కూడిన ఆహారం ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. పోషణ అభియాన్ లో భాగంగా స్థానిక బాలికల పాఠశాల మైదానంలో సీడీపీఓ ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కార్యక్రమాలు నిర్వహించారు. పోషకాలపై అవగాహన కల్పించే విధంగా కూరగాయలు, గుడ్లు, పోషక పదార్థాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు, అయాలు, బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆట పాటలతో సందడి చేసారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ స్టాండింగ్ ఛైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, తహసీల్ధార్ పూల్ సింగ్, ఎంపీడీఓ క్రిష్ణ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేష్ కుమార్, ఎంపీటీసీ దయాకర్, నర్సింహులు, రాజు, ఈఓ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు మునిగెల రాజు, వార్డు సభ్యులు కొలిపాక వేణు, బొల్లు లక్ష్మి, సుజాత, అంగన్ వాడిలు మునిగేల రాణి, నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.