Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ డీఎంహెచ్ఓ గుండాల మురళీధర్
నవతెలంగాణ-తొర్రూరు
నిబంధనలు పాటించని, సరైన పత్రాలు చూపించని ప్రైవేటు ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ గుండాల మురళీధర్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ప్రైవేటు ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ 2002 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 16 ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశామని, సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు లేని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారం రోజుల్లో అన్ని పత్రాలు సరిచేసుకోవాలని, లేదంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రుద్ర పతి, విజరుకుమార్, కె వీర్రాజు, ఇంచార్జి డిప్యూటీ డెమో, ఆప్తాల్మిక్ ఆఫీసర్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.