Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్ కేటా యించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ రమణ అన్నారు. శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలో హరిహర గార్డెన్ లో ఏర్పాటుచేసిన సంఘం మహబూబాద్ జిల్లా రెండవ మహాసభలు నిర్వహిం చారు. అధ్యక్షులుగా జిల్లా కార్యదర్శి గౌని వెంకన్న, జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు మేకపోతుల అంజయ్య కార్మిక అమరులకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఎంవీ రమణ హాజరై మాట్లాడుతూ... మహ బుబా బాద్ జిల్లా 122 గ్రామాల్లో కల్లుగీత కార్మిక సొసైటీలు ఉన్నా యని, గీత కార్మికులందరూ కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గీత సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని, 560 జీవో అమలు చేయాలని, కోటివరాల పథకంలో సొసైటీల కొనుగోలు చేసిన భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. తాటి ఈత ఖర్జూర హైబ్రిడ్ మొక్కలను ఉచితంగా ఇచ్చి నీటి సౌకర్యం కల్పించాల న్నారు. కల్లుకు ప్రభుత్వమే మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో నీరా తాటి ఈత ఉత్పత్తులు పరిశ్ర మలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. అర్హులైన వారందరికీ గుర్తింపు కార్డులు కొత్త జిల్లా పేరుతో ఇవ్వాల న్నారు. ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల న్నారు. మెడికల్ బోర్డు విధానం తొలగించాలని, గీత కార్మికు లకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, మద్యనిషేధం దశలవారీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వానిత సంఘ కన్వీనర్, జిల్లా నాయకులు చిలివేరు సమ్మయ్యగౌడ్, కేసముద్రం కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు బబురు ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి మోడం వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు పానుగంటి వీరస్వామి, మేకపోతుల ఆంజయ్య, గండు సావిత్రమ్మ కేసముద్రం పీఏసీఎస్ చైర్మన్ డి కొండ వెంకన్న, కళాకారుడు మానుకోట ప్రసాద్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు గాడి పెళ్లి శ్రీనివాస్, గౌరమ్మ పంజాల ఉపేంద్ర వీరస్వామి, గంధం వెంకన్న, రాయపల్లి వెంకటేశ్వర్లు సత్యనారాయణ, శ్రీనివాస్, వెంకటరమణ, రాములు, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.