Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొర్రూర్ ఆర్డీవో రమేష్ బాబు
నవతెలంగాణ-తొర్రూరు
క్రీడల్లో రాణిస్తే ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని ఆర్డీవో రమేష్ బాబు తెలిపారు. తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో అండర్-19 బాల బాలికల 41 రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో బాలుర విభాగంలో మహబూబాబాద్ జట్టు విజేతగా నిలువగా, మెదక్ జిల్లా రన్నరప్‌గా నిలిచింది. బాలికల విభాగంలో కామరెడ్డి జట్టు విజేతగా నిలువగా, నలగొండ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ ఫ్లోర్ లీడర్, షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ముగింపు సభలో ఆర్డీవో రమేష్ మాట్లాడారు. ఉద్యోగాల్లో షూటింగ్‌బాల్ క్రీడకు సైతం రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. క్రీడల అభివద్ధి,ప్రోత్సాహం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడాకా రులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని సూచించారు. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలో 28 జిల్లాల నుండి 678 మంది క్రీడాకారులు,100మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో షూటింగ్ బాల్ రాష్ట్ర చైర్మన్ రామ సహాయం కిషోర్ రెడ్డి, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, ఏఎంసీ చైర్మన్ పసుమర్తి శాంతా సీతారాములు, సిడబ్ల్యూసి చైర్మన్ నాగవాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు,రైతు బంధు సమితి కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి, సీనియర్ క్రీడాకారుడు మన్నూరు ఉమా, బహుమతి దాత డాక్టర్ చెరుకుపల్లి సురేష్, షూటింగ్ బాల్ రాష్ట్ర కార్యదర్శి చెడుపల్లి ఐలయ్య,జై సింగ్, తదితరులు పాల్గొన్నారు.