Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ
నవతెలంగాణ-గార్ల
ఎన్నో కష్టా నష్టాలు ఎదుర్కొని నేడు ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి బాటలు వేసిన ఆదర్శ దంపతులు మహాత్మా జ్వోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల జీవితాలను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పీడమర్తి రవి అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూలే దంపతుల విగ్రహాలను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ... అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో అతని భార్య సావిత్రి బాయిని మహిళ ఉపాధ్యాయురాలు గా నియమించి మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసిన మహనీయులని అన్నారు. తనను నమ్ముకున్న టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి అండగా ఉంటానని అన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ అధ్వర్యంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య,మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మెన్ పిడమర్తి రవిని భారీ గజ మాలతో సత్కరించారు. ముందుగా అమరవీరుల స్థూపనికి, అంబేద్కర్, ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గార్ల మండలంలో సుడిగాలి పర్యటన
మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎంపీ పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. చనిపోయిన 50 కుటుంబాల కు ఆర్థిక సహాయం అందించారు. మర్రిగూడెంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అంబేద్కర్ నగర్లో నూతన చర్చిని సందర్శించారు. తీర్లాపురంలో ఇటివల మరణించిన కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ తేజ్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. పక్షవాతంతో బాధపడుతున్న కందుల యుగేందర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని షేక్ తస్లీమా ఇంటికి వెళ్లి అభినందించి ఆర్థిక సాయం అందించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ లక్ష్మీ, ఎంపీపీ మూడ్ శివాజీ, సర్పంచ్‌లు అజ్మీర బన్సీలాలల్, భూక్య మోతీలాల్,ఎంపిటీసి బట్టు నాగరాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండా వెంకటరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, యాకూబ్ పాష, వీరేందర్, ఎల్. భాస్కర్, ప్రవీణ్ కుమార్,ఎ వెంకటేశ్వర్లు, టి శ్రీనివాస్, బి మురళి, చాంద్ మాల్, పఠాన్, కిషన్, జె రమేష్, రవి, రాజశేఖర్, లెనిన్, రామ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.