Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం-వెంకటాపురం
- రహదారిపై కూలీల ఆందోళన
నవతెలంగాణ-వెంకటాపురం
నిబంధనల ప్రకారం రోజు కూలి రూ.311 పెంచాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వ ర్యం లో కూలీలు శుక్రవారం భద్రా చలం-వెంకటాపురం ప్రధాన రహదారిపై కంకలవాగు బ్రిడ్జి వద్ద, భద్రాచలం-వాజేడు రహదారి పై శాంతినగర్ వద్ద రెండు చోట్ల 20 గ్రా మాలకు చెందిన కూలీలు రోడ్డుపై బైఠాయించి ఆందో ళన చేపట్టారు. ఈ సం దర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గ్యానం వాసు మాట్లాడుతూ కూలీ రేటు పెంచాలని కోరుతూ వివిధ రకాలుగా కూలీలు కూలీ పనుల కు వెళ్లకుండా ఆందోళనలు చేస్తున్నారన్నారు. చర్చల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలా రేట్లు పెంచేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్ మాట్లాడుతూ సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడు కోవాని రైతులతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెల పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు వంకా రాములు , కుమ్మరి శ్రీను, కట్ల చారి, ఆదినారాయణ, రాంబాబు, సరస్వతి, 20 గ్రామాల కూలీలు పాల్గొన్నారు.