Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు సత్వరమే అందుబాటులోకి తీసుకురా వాలని డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం కేఎంసి ఆవరణలోని పీఎం ఎస్ఎస్వై ఆసుపత్రి సందర్శించిన ఆయన రోగులకు అందుతున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇటీవల వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన పేషెంట్‌ను కలిసి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి చికిత్సల పైన, హాస్పిటల్ పని తీరు పై వైద్య అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసు పత్రిలో స్పెషల్లైజేషన్ విభాగాల్లో అన్ని శస్త్ర చికిత్సలు అం దించాలని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సత్వరమే ప్రారం భించాలని ఆదేశించారు. ఆయన వెంట కేఎంసి ప్రిన్సిపాల్. డాక్టర్ మోహన్‌దాస్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ రావు, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ న్యూరో సర్జన్ డాక్టర్ నర్సింగ్ రావు, డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎం ఓలు డాక్టర్ హీనా, డాక్టర్ శ్రీనివాస్, నర్సింగ్ సూపరిం టెండెంట్ సుశీల, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.