Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసి పాలసీల పై బోనస్ పెంచాలి...
- పాలసీదారుల లోన్ల పై వడ్డీ తగ్గించాలి
- ఎల్ఐసి కార్యాలయాల ఎదుట ఏజెంట్ల ఆందోళన
నవతెలంగాణ-ములుగు
ఆలిండియా లియాఫీ పిలుపుమేరకు భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్ఐసి పాలసీదారుల ప్రయోజనాల కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగం గా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట లియాఫీ ఆధ్వర్యంలో 50 మంది ఎల్ఐసి ఏజెంట్లు ఆందోళన చేపట్టారు. ఎల్ఐసి పాలసీలపై బోనస్ పెంచాలని, పాలసీలపై లోన్ తీసుకున్న పాలసీదారులకు వడ్డీరేట్లు తగ్గించాలని, కస్టమర్లకు సమర్థవంతమైన సేవలను అందించాలని, ఎల్ఐసి పాలసీ లపై జిఎస్టీ రద్దు చేయాలని, ఏజెంట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్దేశించి ములుగు ఎస్వో శాటిలైట్ అధ్యక్ష కార్యదర్శులు బండపల్లి రవీందర్, ముదురుకోళ్ల సదానందం, గౌరవ అధ్యక్షులు అల్లే శోభన్ మాట్లాడుతూ పాలసీదారుల ప్రయోజనాల కోసం ఏజెంట్లు పాటు పడుతున్నారని గుర్తు చేశారు. దశాబ్దాల కాలంగా ఎల్ఐసి అభివద్ధిలో పాలసీదారులు, ఏజెంట్ల శ్రమ ఎంతగానే ఉందని కానీ నేడు కొత్త నిబంధనల పేరుతో ఎల్ఐసిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ ఏజెంట్లు గురిజాల హనుమంత రెడ్డి, అంకం వినరు కుమార్, జెర్పుల రాజు, మోడెం అశోక్, కారుపోతుల యాదగిరి, ముగ్ధం అశోక్ రెడ్డి, దోమల నరేందర్, దేవులపెళ్లి లక్ష్మీనారాయణ, ఈరసవడ్ల భిక్షపతి, మార్త రాజయ్య, సాంబశివరావు, కడివేడి సత్యం, తదితరులు పాల్గొన్నారు.