Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ రాక
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రి ఆవరణలోని 50 పడకల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిని శనివారం ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రారంభించనున్నట్లు అధికా రికంగా శుక్రవారం ప్రకటన విడుదలైంది. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం జూలై 17న ఐటీడీఏకు వచ్చినప్పడు మంజూరు చేసిన డయా లసిస్ సెంటర్ను కూడా మంత్రులు ప్రారంభించనున్నారు. ఆగస్టు 9న ముందుగా ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేశారు. బందోబస్తు, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆస్పత్రి ప్రారంభించనున్నారు.
ప్రత్యేకతలు
గర్భిణులు, బాలింతలు, శిశువుల కోసం 50 పడకల ఆస్పత్రి, స్కానింగ్ మిషనరీ, వార్మర్స్, రెడియేథెరఫి, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఇక్యుబేటర్స్ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. అలాగే నవజాత శిశువులు, గర్భిణులకు ప్రత్యేక వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయనున్నారు.