Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్
నవతెలంగాణ-పర్వతగిరి
ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కోసం పోషణ అభియాన్ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ తెలిపారు. మండలంలోని అన్నా రం షరీఫ్ సెక్టార్ మంగ్త్యా తండా గ్రామంచాయ తీలోని ఈదులగడ్డ తండాలో శుక్రవారం పోషణ అభియాన్ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురా వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగు తుందని అన్నారు. తద్వారా తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించవచ్చన్నారు. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో సంపూర్ణ పోషకాలు అందేలా చూసుకోవాలని ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండడం వలన సమాజం బాగుపడుతుందని అన్నారు. తహసిల్దార్ అజ్మీర కోమి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో లింగ వివక్షత లేకుండా చూసుకోవాలని పౌష్టికాహారం తినాలన్నారు. కార్యక్ర మంలో సర్పంచ్ ఈర్యా నాయక్, హెల్త్ సూపర్వైజర్ మేరీ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.