Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
రైతు సంక్షేమమే సహకార సంఘ ధ్యేయంమని, నిరంతరం రైతు శ్రేయస్సు కోసం సహకార సంఘాన్ని ముందుండి నడిపిస్తానని ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సాధారణ మహా జన సభా సమావేశం చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి రూ.87లక్షల లాభంతో సంఘం ముం దుకు సాగుతుందన్నారు. సంఘం ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందిందన్నారు. గతంలో సంఘం ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఒక ఎకరా భూమికి రూ.30 వేల రుణం మాత్రమే రైతులకు అందించేదన్నారు. కానీ నేడు రూ. 50 వేల వరకు రుణం అంది స్తామని సభాముఖంగా తెలిపారు. అనంతరం రైతులు మాట్లా డుతూ ప్రస్తుత ఉన్న రుణాల కన్నా రైతుకు పెట్టుబడి ఎక్కువ అవుతున్న కారణం చేత రుణ పరిమితి పెంచాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకష్ణ,రైతుబందు మండల కన్వీనర్ కుంచారపు వెంకట్ రెడ్డి,డీసీవో అసిస్టెంట్ రిజి స్ట్రార్ జ్యోతి,సీఈవో ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు, టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకట నర్సయ్య, సోషల్ మీడియా కన్వీనర్ దాసరి రమేష్, రైతు నాయకులు రెడ్డి నాగా ర్జున రెడ్డి, మాచర్ల కొమ్మాలు, బాబురావు, పాల్గొన్నారు.