Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక న్యాయవేదిక
- జిల్లా అధ్యక్షుడు చల్లా లింగయ్య పటేల్
నవతెలంగాణ-ములుగు
మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపిం చాలని సామాజిక న్యాయవేదిక జిల్లా అధ్యక్షుడు చల్లా లింగయ్య పటేల్ కోరారు. జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయవేదిక ముఖ్య నాయకుల సమావేశం నియోజకవర్గం అధ్యక్షులు పోరిక సామల్ నాయక్ అధ్యక్షత శుక్రవారం నిర్వ హించారు. ఈ సమావేశానికి లింగయ్య పటేల్ ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడుతూ మునుగోడులో వచ్చిన ఎన్ని కలు అగ్రకుల దొర రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ పనులకు ఆశపడి బిజెపికి అమ్ముడు పోయాడన్నారు. అగ్రకుల బ్రాహ్మ ణవాదుల చేతిలో కొయ్యగుర్రంగా మారడంతో కాం గ్రెస్‌కు రాజీనామా చేస్తే వచ్చిన ఎన్నికలు బిజెపి ఆడిం చినట్లు ఆడుతూ మునుగోడు ప్రజల అభివృద్ది కోసం రాజీ నామా చేశానని చెప్పడం అంటే ప్రజలను ముమ్మాటికీ మో సం చేయడమెనని ఆరోపించారు. 88 శాతం జనాభా కలి గిన దళిత బహుజనులకు టికెట్లు కేటాయించక పోవడం భాదాకరమన్నారు. మునుగోడు ఎన్నికలు అగ్రకులాలకు అ ణగారిన కులాలకు మధ్య జరిగే వేదిక కావాలన్నారు. కార్య క్రమంలో జిల్లా కార్యదర్శి కోరే రవియాదవ్, చాకలి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గూడెల్లి ఒదెలు, రజక బొల్లొని రామారావు,గోపాల ఒదెలు యాదవ్,కళాకారుడు అర్జున్,రంజిత్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.