Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
బల్దియా పరిధిలో అనధికార నిర్మాణాలు, ప్రైవేట్ హోర్డింగ్స్ గుర్తించాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో అనధికార నిర్మాణాలు, హోర్డిం గ్స్లపై సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర ప్రజలు సులువుగా, వేగవంతంగా భవన నిర్మాణాల అనుమతులు పొందుటకు రాష్ర ్టపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బిపాస్ను ప్రవేశపెట్టి అమలు అవుతుందని చెప్పారు. భవన నిర్మాణానికి టీఎస్ బి పాస్లో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా అనుమతులు మంజూ రు చేయాలన్నారు. అనధికార నిర్మాణాలు జరుగ కుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. చైర్మన్లు, టిపిబిఓలు వారి డివిజన్లలో క్షేత్ర స్థాయిలో ప్రతిరోజు తిరిగి అనుమతి లేకుండా నిర్మించే భవనాలు, డివియేషన్ల వివరాలు పై అధికారులకు తెలియజేసి అలాంటి నిర్మాణాలపై వెంటనే తగు చర్యలు తీసు కోవాలని అన్నారు .అదేవిధంగా అనధికార హోర్డింగ్స్ల వివ రాలు సేకరించి వాటిని క్రమబద్దీకరించి బల్దియా ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. డివియేషన్కు పోకుండా, అనధికార అంతస్తు కట్టకుండా టిడిఆర్లను ప్రజలు వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్నారు. రెసిడెన్షియల్ అనుమతి పొంది, కమర్షియల్గా వినియో గించు కొంటున్న భవనాలను కూడా గుర్తించాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో డాక్యుమెంట్ వేరిఫికేషన్, క్షేత్ర స్థాయిలో సైట్ ఇన్స్పెక్షన్ క్షుణ్ణంగా నిర్వహించిన పిదప నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు జరగ కుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉం దన్నారు. సమీక్షలో సిటీ ప్లానర్ వెంకన్న, ఉప కమిషనర్లు శ్రీని వాస్రెడ్డి, జోనా, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీని వాస్రావు, బషీర్, సుష్మ, టిపిఎస్లు శ్రీకాంత్, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.