Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
- తక్కళ్ళ పెల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-ములుగు
కేంద్ర ప్రభుత్వ మతద్వేష విధానాలపై తిరుగుబాటు చేయాలని సీపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్ల పెళ్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిపిఐ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లా డారు. తెరముందు గోవు, తెరవెనుక పాము, విధానాలతో, విద్వేషపూరిత పాలన సాగిస్తున్న బిజెపి అత్యంత ప్రమా దకరమైందన్నారు. ఆ ప్రభుత్వాన్ని సాగనంపితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు. ఈ ఎనిమిది సంవత్స రాల్లో లాభాలలో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసే పనిలో పడ్డారు అన్నారు.ప్రజలను చైతన్యం చేయ డంలో భాగంగా అక్టోబర్ 14, నుండి 18 వరకు విజయ వాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపి ఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ రావు, జిల్లా సమితి సభ్యులు ఆచంట ప్రసాద్, ఇంజం కొమురయ్య, జక్కుల ఐల య్య, ముత్యాల రాజు, వడి సారయ్య, నాసర్, రవి, ముత్త య్య, బాలక్రిష్ణ, ఆదినారాయణ, రాము, కొండయ్య పాల్గొన్నారు.