Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదవి కోసం తాకట్టు పెట్టొద్దు..తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖలో డిమాండ్
నవతెలంగాణ-నర్సంపేట
బయ్యారం ఉక్కు పరిశ్రమ కుదరదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమపై బీజేపీ ప్రభుత్వం మాట మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా ఉండి కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుంటే ప్రశ్నించాల్సి పోయి వారి అడు గులకు మడుగులొత్తడం దుర్మార్గమని విమర్శించారు. విభజన చట్ట ప్రకారం రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ కేంద్రం తీరని అన్యాయం చేసిందన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంత వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎంతగానో తోడ్పడనుందన్నారు. తెలంగాణపై కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షతపై కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించని, కోచ్ ఫ్యాక్టరీ తరలించుపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని, ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఈ ప్రాంత ప్రయోజనాలను నీ పదవీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టడం ఎంత వరకు సమం జసమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టబోతుంటే వస్తుంటే ఆదరణ చూసి తెలంగాణకు రావాల్సిన నిధులు, విధులు, కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్ర మను కుట్ర పూరి తంగా అడ్డుకొంటుందని దుయ్యపట్టారు. కేం ద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాసి ఉక్కు పరిశ్రమను అడ్డుకొంటే ప్రజలు ఘోరి కట్టడడం తధ్యమని స్పష్టం చేశారు.ఈ కుట్రల ను ప్రజాక్షేత్రంలో చర్చపెట్టి, ప్రజలను ఏకం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామ న్నారు. బ య్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని వెం టనే కిషన్ రెడ్డి వాఖ్యలను వెనక్కి తీసు కొంటూ విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి హరీష్‌పై వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలపై ఖండన
ఏపీ ఐటీశాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి హరీష్‌రావుపై చేసిన వ్యాఖ్యలను పెద్ది ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్మెంట్ ఇస్తుంటే పక్క రాష్ట్రంలో 66 శాతానికి మించి ఇవ్వలేదని, కేంద్రం షరతులకు తలొగ్గి మీటర్లకు మీటర్లు పెట్టి రూ.7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయిందని మంత్రి చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై అనేక దఫా లుగా ఫిర్యాదులు చేసిందన్నారు. ఉద్యోగులను కించపర్చే విధంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడాడని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మంత్రి హరీష్‌రావు ఇతర రాష్ట్రాల వారిని, ఉద్యోగులపై ఏనాడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఉచిత కరెంట్ పేరిట అధికారంలోకి వచ్చిన వైఎస్ ఆశయాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని విమర్శించారు. ఏపీ మంత్రులు వెంటనే తెలంగాణపై, ఇక్కడి మంత్రులపై అనవసరం వాఖ్యలు చేయడం మానేసి అభివృద్ధిలో పోటిపడాలని పెద్ది హితువు పలికారు.