Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత, మైనార్టీలపై దాడులను ప్రతిఘటిద్దాం
- సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు
నవతెలంగాణ-ఖిలావరంగల్
అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడు దామని సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయ కులు రాచర్ల బాలరాజు అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే స్థాపించిన సత్యశోధకు సమాజ్ 149వ ఆవిర్భావ దినోత్సవాన్ని దళితులపై జరుగు తున్న దాడులకు వ్యతిరేకంగా జరపాలని న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం రాత్రి నక్కల పల్లిలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐఎఫ్ టియు నగర ప్రధాన కార్యదర్శి బన్న నర్సింగం అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సంవ త్సరాల నుండి భారతదేశంలో కొనసాగుతున్న కుల వ్యవస్థ, పీడిత వర్గాలను ఏకాకులను చేసి శ్రమదోపిడి చేస్తూనే సంపదను వారికి దూరం చేసిందన్నారు. నేడు దేశంలో దళి తులపై జరుపుతున్న హత్యాకాండ భూస్వామ్య వర్గాలు అగ్ర కుల దురహం కారులు భూమి పైనే కాక రాజకీయ ఆధి పత్యం కూడా వారి ఆధీనంలో ఉండడం వల్లనే ఈ అమా నుష హత్యాకాండ కొనసాగుతున్నదని చెప్పారు. ఈ దోపిడీ వర్గాల భూస్వామ్య పెట్టుబడిదారీ సా మ్రాజ్యవాదానికి వ్యతి రేకంగా ఉద్యమించడమే మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రి బాయిలకు మనం అందించే నివాళి అని, అలాంటి ఉద్య మా ల నిర్మాణానికి దళిత పీడిత వర్గా లు ముందుకు రావా లని ఆయన పిలుపునిచ్చారు. కార్య క్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు, ఐ ఎఫ్టియు అధ్యక్షులు జయ బాబు, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు పాల్గొన్నారు.