Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల బ్రాంచ్ లియాఫీ జేఏసీ చైర్మెన్ బూర బాబు
నవతెలంగాణ-శాయంపేట
సంఘటితంగా ఉద్యమిస్తేనే ఎల్ఐజీ ఏజెంట్ల సమస్యలు పరిష్కారం అవుతాయని లియాఫీ పరకాల బ్రాంచ్ జేఏసీ చైర్మెన్ బూర బాబు స్పష్టం చేశారు. ఎల్ఐసి జేఏసీ ఆల్ ఇండియా నాయకుల పిలుపు మేరకు పరకాల పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయంలో ఎల్ఐసి ఏజెంట్లు విశ్రాంతి దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ధర్నా చేసి దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరానికి కమ్యూనిస్టు నాయకులు అంకేశ్వరపు ఐలయ్య, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. ఎల్ఐసీ పాలసీలపై బోనస్ రేట్లు పెంచాలని, రుణాలపై వడ్డీ రేటు తగ్గించాలని, ఏజెంట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, పాలసీ సర్వీసింగ్‌ను మెరుగుపర్చాలని, ఏజెంట్ల పిల్లలకు విద్యా రుణాలు అందించాలని, ఏజెంట్లకు గ్రాట్యూటీ పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడిక్లైమ్ పెంచాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెంట్ల సమస్యలను యజమాన్యం పరిష్కరించే వరకు నూతన వ్యాపారాన్ని నిలిపేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కన్వీనర్ వలిగే లింగారావు, కోకన్వీనర్ తీగల అశోక్‌రావు, వేములపల్లి కుమారస్వామి, నాయకులు ఆకుల రవీందర్, అడ్డికేల శ్రీనివాస్, కోమటి వీరస్వామి, చంద్రమౌళి, రాజేందర్, వెంకటేశ్వర్లు, హరిప్రసాద్, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.