Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
మండలంలోని ప్రేమ్‌నగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ జాటోత్ రమ్య వంశీనాయక్ ఆధ్వర్యంలో గ్రామ రైట్స్ కమిటీకి అధికారులు అవగాహన కల్పిం చారు. ప్రేమ్‌నగర్ పరిధిలోని పోడు రైతుల భూములు ఆజంనగర్ రేంజ్, ఎర్రా రం మీనాజీపేట బీట్‌లో పోడు రైతులు దరఖాస్తు చేసుకోగా శుక్రవారం అధికా రులు దరఖాస్తులను పరిశీలించి అటవీ భూమి సరిహద్దులను గుర్తించి సాగులో ఉన్న రైతులకు అర్హులుగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. పోడు దరఖాస్తుదారు సాగులో ఉన్న వారి భూములే కాకుండా అతివష్టి, అనావష్టితో పంటలు వేయలేకపోయారు. వారిని అధికారులు అర్హులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో జాటోత్ రాజునాయక్, వంశీనాయక్, బీట్ ఆఫీసర్ పత్తిబాబు, గ్రామ కార్యదర్శి అశోక్, తదితరులు పాల్గొన్నారు.