Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- ఆసరా పింఛన్లు పంపిణీ
నవతెలంగాణ-దామెర
రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట, సీతారాంపురం, దమ్మన్నపేట గ్రామాలకు చెందిన లబ్దిదారులకు గురువారం ఆయన ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఊరుగొండకు 140, దుర్గంపేటకు 30, సీతారాంపురానికి 18, దమ్మన్నపేటకు 26 ఆసరా పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రూ.12 వేల కోట్ల పింఛన్లు అందిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే పింఛన్ వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పది లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరైనట్టు చెప్పారు. బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలను మహిళలు, వద్ధులు, నాయకులు తగిన రీతిలో ప్రశ్నించాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ పథకాలు అమలౌతున్నాయని ప్రశ్నించాలని సూచించారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, జెడ్పీటీసీ కల్పన కష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, పార్టీ మండల అధ్యక్షుడు రామకష్ణ, బిల్ల రమణారెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.