Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మహిళల అబివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండలంలోని పరశురాంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, ధర్మరావుపేట, బుద్ధారం గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ, లబ్దిదారులకు ఆసరా పింఛన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, సీఎం ఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికా రంలో ఉన్న రాష్ట్రాల్లో పింఛన్ కేవలం రూ.500లు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప అందరికీ పింఛన్లు ఇస్తున్నట్టు చెప్పారు.సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ అందించి పేదలకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ అరుంధతి, సొసైటీ చైర్మెన్ పూర్ణచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ అశోక్, సర్పంచ్లు మంజుల భాస్కర్రావు, లక్ష్మి, ఆగమ్మ, గండ్ర ఆగమ్రావు, తదితరులు పాల్గొన్నారు.