Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ జిల్లాలో మలేరియా డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదు అవ్వడం వలన జిల్లా యంత్రాంగం అప్రమ త్తమైందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకట రమణ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ జిల్లాలోని వైద్యాధికారులతో జూమ్ మీటింగు ద్వారా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 105 డెంగు కేసులు, 36 మలేరియా కేసులు ప్రధానంగా భానోజీపేట, గీసుకొండ, ఖానాపూర్ ,ఎస్ఆర్ఆర్ తోట, దేశాయిపేట ,కాశీ బుగ్గలలో ఎక్కువ నమోదైనయని తెలిపినారు. వీటి పైన తక్ష ణమే చర్యలు తీసుకోవడానికి వైద్యాధికారులకు సూచన లిస్తూ ఎక్కడ డెంగ్యూ కేసు వెళ్లిన ,మలేరియా కేసు వెళ్లిన వెంటనే అక్కడ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ,ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేయాలని తెలుపుతూ వెంటనే పాజిటివ్ వచ్చిన ఏరియాలో ఆంటీ లార్వల్ డిస్ ఇన్స్పెక్షన్, మలేరియా స్ప్రే ద్వారా దోమలను అరికట్టాలని అన్నారు . ప్రోగ్రాం అధికారి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ,ఆరోగ్య పర్యవేక్షకులు ,వైద్యా ధికారుల ద్వారా టీములను ఏర్పాటు చేయాలని తెలుపుతూ, పట్టణంలో గ్రేటర్ మునిసిపాలిటీ మలేరియా సిబ్బంది సమ న్వయంతో డెంగ్యూ మలేరియా కేసులను నియంత్రణ చేయడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉండాలని ,మురికి గుంటలలో నీరు నిలువలేక లేకుండా చేయాలని, వారానికి ఒక రోజు నీటిని మార్చుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపినారు.