Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కాటారం
ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారంలోని అంబేద్కర్ కూడలిలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆసరా పింఛన్ల మంజూరైన నిధులను, వరదల వల్ల నష్టపోయిన వారికి నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సమ్మయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారి 353సి పై సుమారు గంటసేపు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎంపీపీ సమ్మయ్య, ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారికి ఆసరా పింఛన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మండలంలో అర్హులైన వద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు సరిగా అందడం లేదని విమర్శించారు. 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి, సదరన్ క్యాంపు ద్వారా సర్టిఫికెట్లు పొందిన వికలాంగులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు కొందరికి అవగాహన లేక సరైన సమాచారం తెలియక చాలామంది అప్లై చేసుకోలేదని అన్నారు. వెంటనే వారికి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదల వల్ల దామెర కుంట, విలాసాగర్, గంగారం, మల్లారం, గుండ్రాత్ పల్లి గ్రామాలు పూర్తిగా నష్టపోయారని అన్నారు. అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ వల్ల గత నాలుగు సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కానీ ఇంతవరకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. వరదల వల్ల ఇల్లు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం కూడా అందించలేదని అన్నారు. వరద వల్ల నష్టపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందిం చాలని అన్నారు. కార్యక్రమం అనంతరం కాటారం తహ సీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం ఇచ్చారు. డిసిసి ఉపా ధ్యక్షులు సమ్మిరెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రావు, సర్పంచులు దేవేందర్ రెడ్డి, అశోక్, రఘురాం నాయక్, రాజయ్య, బాసాని రఘువీర్, చంద్రశేఖర్, నాయకులు రాజు, పాల్గొన్నారు.