Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న సీఈవో కుమారుడు డైరెక్టర్లు
- చైర్మన్ నియంతలా వ్యవహరిస్తున్నారని డైరెక్టర్ల ఆరోపణ
- కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న దళిత సంఘం నాయకులు,
- చైర్మన్ పై ఫిర్యాదు చేసిన సీఈవో లింగమూర్తి
నవతెలంగాణ- శాయంపేట
పిఎసిఎస్ జనరల్ బాడీ సమావేశం కోసం పాలకవర్గం తీర్మాన కాపీని డిసిఒ కార్యాలయంలో అందజేయడానికి బస్సులో వెళుతుండగా పిఎసిఎస్ చైర్మన్ శరత్ ములుగు రోడ్డు వద్ద బస్సులోనే అకారణంగా తనను దూషిస్తూ దుర్భా షలాడుతూ బస్సు నుండి దించి కార్యాలయానికి పంపిం చాడని మనస్తాపం చెందిన ఇన్చార్జి సీఈవో లింగమూర్తి కార్యాలయం ముందు పురుగుల మందు తాగేందుకు ప్రయ త్నం చేయగా, ఆయన కుమారుడు, డైరెక్టర్లు అడ్డుకున్న సంఘటన శనివారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధితుడు, డైరెక్టర్ల కథ నం ప్రకారం.. పిఎసిఎస్ కార్యాలయంలో ఇన్చార్జి సీఈవోగా నాగేల్లి లింగమూర్తి విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సొసైటీ మహాసభ కోసం పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి అక్టోబర్ 10న జరిపేందుకు తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని డిసిఒ కార్యాలయంలో అందజేయడానికి సీఈఓ లింగమూర్తి శనివారం బస్సులో వెళ్తుండగా ములుగు రోడ్డు వద్ద చైర్మన్ కుసుమ శరత్ బస్సు ఎక్కి తనను అకారణంగా దుర్భసలాడుస్తూ దూషిస్తూ బస్సు నుండి దించి, తన కారులో కూర్చోబెట్టుకొని మినిట్స్ బుక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించగా, లాకర్లో ఉంచినట్లు తెలిపారు. తీర్మానం కాపీ తనకు చూపించకుండా ఎలా డిసిఒ కార్యాలయంలో ఇస్తావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాయంపేట కార్యాలయానికి వెళ్లాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తాను డైరెక్టర్లకు తెలియజేయడంతో డైరెక్టర్లు కార్యాలయానికి వచ్చి నట్లు తెలిపారు. గతంలో కూడా తనపై దుర్భసలాడాడని, తాను చేసిన తప్పు ఏమిటని మనస్థాపన చెంది కార్యాలయం ముందు పురుగుల మందు సేవించబోగా సీఈఓ కుమారుడు ప్రశాంత్, డైరెక్టర్లు అడ్డుకొని నచ్చజెప్పారు. ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కార్యాలయం చేరుకున్నారు. సమాచారం తెలుసు కున్న పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుండి పంపించివేశారు. పోలీసు భద్రత నడుమ చైర్మన్ శరత్ ను ఆయన ఇంటికి పంపించారు.
నియంతలా వ్యవహరిస్తున్న చైర్మన్ : డైరెక్టర్లు
చైర్మన్ శరత్ నియంతలా వ్యవహరిస్తూ తమకు ఎలాం టి సమాచారం ఇవ్వడం లేదని డైరెక్టర్లు బగ్గి రమేష్, ఎల మంచి జయపాల్ రెడ్డి, తోట శ్రీనివాస్, చాడా మహేందర్ రెడ్డి, మంద మల్లయ్య, సదర్ లాల్ లు తెలిపారు. సొసైటీ కి రుణాల కోసం 25 లక్షల బడ్జెట్ మంజూరై 20 రోజులు గడు స్తున్న తమకు సమాచారాన్ని ఇవ్వలేదని, శుక్రవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో తెలియజేశారని, అదే రోజు చివరి తేదీ అని మండిపడ్డారు. గతంలో ఇన్చార్జి సీఈవో లక్ష్మణ్ పై దుర్భసలాడడంతోనే అతను వెళ్లిపోయాడని తెలిపారు. సి ఈ ఓ మోహన్ జాయిన్ కావడానికి ఆర్డర్ కాపీ ఆగస్ట్ 25న వచ్చిన ఇప్పటివరకు తీసుకోలేదని, దీనికి లక్ష రూపాయల లంచం కూడా ఇచ్చినట్లు డైరెక్టర్లు తెలిపారు. గన్ని సంచులు కూడా రైస్ మిల్లులో అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇదే విషయమై చైర్మన్ శరత్ ను వివరణ కోరగా తన సంతకం లేకుండా తీర్మానం కాపీ ఎలా ఇస్తావని ప్రశ్నించనే తప్ప దూషిం చలేదని, దుర్భాషలాడలేదని తెలిపారు. ప్రతి సమా చారాన్ని డైరెక్టర్లకు అందజేస్తున్నానని, డైరెక్టర్లు తనకు ఎలాంటి లంచం డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. సివిల్ సప్లై ఆదేశాల మేరకు గన్ని సంచులు శ్రీనివాస రైస్ మిల్లులో ఇచ్చినట్లు తెలిపారు.