Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
- జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ-భూపాలపల్లి
పూలను పూజించే పండుగ బతుకమ్మ అని సంస్కతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా అధికారులతో పాటు మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు. ప్రతి రోజు సమావేశాలు, సమీక్షలు బిజీగా ఉండే కలెక్టర్ కార్యాలయం నేడు మహిళా ఉద్యో గినుల ఆటపాటలతో సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అధికారులు, మహిళా ఉద్యోగులు, మహి ళలు, టి.ఎస్.ఎస్ కళాకారులు, విద్యార్థినిలు, ఆట పా టలతో ఆనందంగా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ కార్యాలయలకు సంబంధించిన మహిళా ఉద్యోగినులు బతు కమ్మలతో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకు న్నారు. ఈ వేడుకలతో కలెక్టరేట్ ప్రాంగణం అంత సందడిగా మా రింది. బతుకమ్మ పాటలతో కలెక్టర్ ప్రాంగణం మార్మోగి పోయింది. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ మహిళా స్పూర్తి ని, మహిళా శక్తిని తెలియ జేస్తూ, 9 రోజులు పూలను పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ అని, అదే విధంగా భారతదేశం మొత్తం ప్రజలు భక్తి శ్రద్దలతో అమ్మ వారిని పూజించడం జరుగుతుందని బతుకమ్మ పండుగ అమ్మ వారిని పూజించే వివరాలు అడిగి తెలుకుని మహిళలు తో పాటు బతుకమ్మ ఆడినారు.
అనంతరం జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, జెడ్పి సి.ఈ.ఓ. శోభారాణి, డిఆర్డీఓ పురు షోత్తం, సి.పి.ఓ. శామ్యూల్, బి.సి.వెల్ఫేర్ అధికారిని శైలజ మహిళా అధికా రులు, ఉద్యోగులు, సిబ్బంది జిల్లా అధికారులు , మహిళలు, టి.ఎస్.ఎస్. కళాకారులు, కార్యాల య సిబంది పాల్గొన్నారు.