Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంచార్జి డిడబ్ల్యువో కె.మధురిమ
నవతెలంగాణ-సుబేదారి
వయోవృద్ధుల సంరక్షణ సామాజిక బాధ్యతని ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కే. మధురిమ అన్నారు.అంతర్జాతీయ వయోవద్ధుల దినోత్సవం శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి.సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధురిమ మాట్లాడుతూ వయోవృద్ధులు వారి జీవితంలో ఎన్నో సమస్యలను సవాళ్ళను ఎదుర్కొని వారి జీవిత అను భవాలను ఇతరులకు చెప్పినప్పుడు వారిని అచేతనులు, చాదస్తులు అనే చులకన భావంతో చూడటం విచారకర మన్నారు. వారు జీవిత సత్యాలను చెప్పే మేధావులని, అలాం టి వారితో ప్రేమ పూర్వకంగా వ్యవరించాలని వారి సంరక్షణ విషయంలో మానవీయ కోణంలో బాధ్యతలు నిర్వర్తిం చాలన్నారు. ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తుంటే వద్ధులు నిర్లక్ష్యానికి గురికా వడం వారిపై నిర్లక్ష్యం అనేది సామాజిక సమస్యగా మారిం దని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి విదేశాలకు పంపిస్తే వారు అక్కడే స్థిరపడి ఇక్కడ ఉన్న తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. నిరా దరణకు గురికాబడిన వయోవృద్దులకు మహిళా శిశు దివ్యాం గులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అండగా ఉన్నదని, తాము ఒంటరి వారిమనే భావన ఉండకూడదని అన్నారు. వారి సంరక్షణ విషయంలో సలహాలు, సూచనలు, సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని తెలియచేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కే. దామోదర్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ కే. అనితారెడ్డి మాట్లాడుతూ వయో వద్దులకు పోషణ సంరక్షణ విషయాల్లో సులభమైన వేగవంతమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు న్యాయస్థానాలతో సంబంధం లేకుండా తల్లి తండ్రులు వయో వద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2011ను రూపొందించిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియే షన్ అధ్యక్షుడు దామేర నర్సయ్య, సీని యర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ చంద్రమౌళి, సిడిపి వోలు కే. శిరీష, బి భాగ్య లక్ష్మి, స్వరూప, యూడీసిలు వి వెంకట్రామ్, రామ చంద్ర మూర్తి, జూనియర్ అసిస్టెంట్ పి రేవంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. ప్రవీణ్ కుమార్, ఎఫ్ఆర్వో కే. జయధర్, సూపర్వైజర్లు టీచర్లు పాల్గొన్నారు.