Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్
నవతెలంగాణ-వేలేరు
గ్రామాల సమస్యలు పట్టని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ వేలెర్ మండలం చింతల తండా గ్రామంలో అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు కట్రేవుల రాజు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై బిజెపి పోరు బాట కార్యక్రమంలో భాగంగా బొజ్జపల్లి సుభాష్, నియో జకవర్గం కన్వీనర్ అయిలోని అంజిరెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పల్లా సొంత మం డలం అయినప్పటికీ గ్రామంలో సరైన ఇండ్లు, అంతర్గత రోడ్లు లేక తండా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నా రన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు ఉండి కూడా స్టేషన్ఘనపూర్ నియోజక వర్గం అంధకారంలోకి నెట్టి వేయబడుతుంది అన్నారు. తండా వాసుల సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల బిజ ెపి ఆధ్వ ర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెవైఎం మండల అధ్యక్షులు మలోతు రాజు, మాలోతు మహెదర్, మలోతు అంజి, సంపత్, రవి, వెంకటేశ్, మారుపాక నవీన్ కుమార్, బూత్ అధ్యక్షులు కునా యుగంధర్, మలోతు జగ్మల్, రవీందర్ లకావత్ నాను, అంగోతు రాజు, జనగామ జిల్లా సీనియర్ నాయకులు కావటి ముత్యాలు, జనగామ సంస్కతిక సెల్ కన్వీనర్ ఎండీ వలి పషా, స్టేషన్ ఘనపూర్ మండల ప్రధాన కార్యదర్శి స భాస్కుల ఆరో గ్యం, బిజెవైఎం మండల అధ్యక్షులు నునావత్ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.