Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
- జనగామ జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని తెలంగాణ రైతు సంఘం జనగా మ జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో రైతు సంఘం మండల మహాసభ నిర్వహించారు.. మహాసభకు పిన్నింటి సమ్మయ్య అధ్యక్షత వహించగా సోమయ్య పాల్గొని మాట్లాడుతూ స్వామి నాథన్ కమిషన్ అమలు చేయాలన్నారు.రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపార దగ్గర అప్పు తెచ్చి పంట పెట్టుబడి పెడితే గిట్టు బాటు ధర రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో రైతు లు ఉన్నారని తెలిపారు. రైతుల పాత రుణాలు వెంటనే రద్దు చేయాలని అన్నారు. యాసాంగిలో రైతులు పండించిన పంటలను ఐకెపి ధార కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఒక వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ అదానీలకు మాత్రం రాయితీలు ఇచ్చి రైతులకు మాత్రం ఎరువులు కానీ మిగతా సబ్సిడీలు ఇవ్వడం మొత్తం మానేశారని ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం రైతుల స్టార్టర్లకుమీటర్లు పెడతామని ప్రచారం చేస్తూ రైతుల్ని ఆందోళనకు గురిచేస్తుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనియెడల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదతం చేస్తామని వారు హెచ్చరించారు.